Tulasi reddy: కొణిజేటి రోశయ్యకు ఏపీ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోవడం, నివాళులు అర్పించకపోవడం చాలా దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. సీఎం జగన్ సంస్కారహీనుడని, ఆ విషయం చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని మండిపడ్డారు.
"జగన్ సంస్కారహీనుడు.. ఇంతకన్నా నిదర్శనం కావాలా?" - కపడపో తులసిరెడ్డి పర్యటన
Tulasi reddy: దివంగత కొణిజేటి రోశయ్యకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోవడం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు. జగన్ సంస్కారహీనుడనడానికి ఇంతకంటే నిదర్శనం లేదని ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన గొప్ప ఆర్థికవేత్త రోశయ్యకు.. రాష్ట్ర అసెంబ్లీలో కనీసం సంతాప తీర్మానం పెట్టకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ ప్రజలకు క్షమాపణ చెప్పి.. సంతాప తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి:Varla letter to DGP: 'సంఘ విద్రోహశక్తుల నుంచి చంద్రబాబుకు ముప్పు ఉంది..' డీజీపీకి వర్ల రామయ్య లేఖ