ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే.. జిల్లాలు విభజించడం కాదు : తులసి రెడ్డి - ap news

జిల్లాల విభజనపై ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. 13 జిల్లాలను విడగొట్టి అభివృద్ధి వికేంద్రీకరణ అని డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.

తులసీరెడ్డి
తులసీరెడ్డి

By

Published : Apr 4, 2022, 3:51 PM IST

"పంటి నొప్పికి తుంటి మీద తన్నినట్టుంది జగన్ పాలన" అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. 13 జిల్లాలను విడగొట్టి 26 జిల్లాలు చేసి, ఇదే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ అని డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని మండిపడ్డారు. 73, 74 రాజ్యాంగ సవరణల మేరకు గ్రామ పంచాయతీలు, తదితర స్థానిక ప్రభుత్వాలకు విధులు, నిధులు, అధికారాలు బదలాయిస్తే అది నిజమైన పాలనావికేంద్రీకరణ అవుతుందని పేర్కొన్నారు. గాలేరు నగరి, పోలవరం తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రత్యేక హోదా సాధించి ప్రతి జిల్లాలో పరిశ్రమలు సాధిస్తే అది నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందని, అవి చేయకుండా.. 13 జిల్లాలైనా, 26 అయినా,175 అయినా ప్రయోజనం లేదని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details