ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి: ఎస్పీ అన్బురాజన్ - కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ వార్తలు

పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ దిశానిర్దేశం చేశారు. 2018 సంవత్సరానికి ముందు ఉన్న కేసులన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు.

KADAPA SP
KADAPA SP

By

Published : Dec 11, 2020, 10:56 PM IST

పోలీసులు నిబద్ధత, నిజాయితీతో పని చేయాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నేరాలపై సమీక్ష నిర్వహించారు. దీనికి డీఎస్పీలు, సీఐలు హాజరయ్యారు. 2018 సంవత్సరానికి ముందు ఉన్న కేసులన్నింటినీ పరిష్కరించాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. స్పందన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details