- బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల రెండ్రోజుల్లో..
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ, ఇవాళ, రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్
వర్షాలు తగ్గాక ముందుగా రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 739 కరోనా కేసులు.. 14 మరణాలు
రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 43,594 మంది నమూనాలు పరీక్షించగా.. 739 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 14 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CHANDRABABU: అప్పుడు లేని ఆంక్షలు..ఇప్పుడెందుకు? : చంద్రబాబు
వినాయక చవితి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్సార్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు.. వినాయక చవితికి ఏ విధంగా వర్తిస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అఫ్గాన్'పై మోదీ సమీక్ష- కమిటీ ఏర్పాటుకు నిర్ణయం!
అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు, భారత్ అనుసరించాల్సిన విధానాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇందులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్లు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్ అధ్యక్షతన గురువారం బ్రిక్స్ సదస్సు
బ్రిక్స్ దేశాల 13వ శిఖరాగ్ర సదస్సు(brics summit 2021) సెప్టెంబర్ 9న జరగనుంది. భారత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి బ్రిక్స్ దేశాల నేతలు హాజరుకానున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తాలిబన్ల వశమైన 'పంజ్‌షేర్'- ప్రభుత్వం ఏర్పాటే తరువాయి!
అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షేర్(Panjshir Valley) లోయను తాము హస్తగతం చేసుకున్నామని తాలిబన్లు(Afghanistan taliban) సోమవారం ప్రకటించారు. దీంతో అఫ్గానిస్థాన్‌లో ఇన్నాళ్లు.. తాలిబన్ల వశం కాని ఏకైక ప్రాంతం కూడా వారి అధీనంలోకి వెళ్లిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Stock Market: కొత్త గరిష్ఠాలకు సూచీలు- ఐటీ షేర్లు భళా
స్టాక్ మార్కెట్లు లాభాలు గడించాయి. సెన్సెక్స్ (Sensex Today) 167 పాయింట్లు పెరిగి.. తొలిసారి 58,290 పైన స్థిరపడింది. నిఫ్టీ (Nifty Today) 54 పాయింట్లు బలపడి.. జీవనకాల గరిష్ఠమైన 17,350 మార్క్ ను దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IND Vs ENG: విజయానికి రెండు వికెట్ల దూరంలో టీమ్ఇండియా
ఇంగ్లాండ్‌తో జరుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయంవైపు దూసుకెళ్తుంది. ఇంకా రెండు వికెట్లు పడగొడితే మ్యాచ్‌లో గెలుపును సొంతం చేసుకుంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మెగా ఫ్యామిలీతో వివాదంపై జీవిత కీలక వ్యాఖ్యలు
'మా' ఎన్నికలు రోజురోజుకూ రంజుగా మారుతున్నాయి. బండ్ల గణేశ్-జీవితా రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే మెగా కుటుంబంతో వివాదంపై జీవిత రాజశేఖర్ స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధానవార్తలు @9PM