ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @5PM - ap top ten news

..

TOP NEWS @5PM
ప్రధాన వార్తలు @5PM

By

Published : Aug 27, 2021, 5:01 PM IST

  • నాలా చట్టంలో మార్పులు.. వ్యవసాయేతర అవసరాలకు సాగు భూమి
    రాష్ట్రంలో సాగుభూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుకునేందుకు వీలుగా ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ మేరకు నాలా చట్ట నిబంధనలు సవరిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నాపై అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి
    నాపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సమితి అధ్యక్షుడి నుంచి నేటి వరకు నిజాయితీగా పనిచేశానని ఆయన స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 15 రోజుల్లో కౌలు, పింఛన్​ ఇవ్వకపోతే.. సీఆర్​డీఏ కార్యాలయం ముట్టడిస్తాం..
    కౌలు చెక్కులు విడుదల చేయాలంటూ అమరావతి రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి సీఆర్​డీఏ కార్యాలయం వరకు రైతులు ర్యాలీ చేశారు. 15 రోజుల్లో తమకు రావాల్సిన కౌలు, పింఛన్‌ ఇవ్వకపోతే విజయవాడలోని సీఆర్​డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యారాడ వద్ద గాల్లో హెలికాప్టర్‌ చక్కర్లు.. క్లారిటీ ఇచ్చిన నేవీ..!
    విశాఖపట్నం యారాడలో హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని నేవీ స్పష్టం చేసింది. కొత్తగా 3 హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్లు తూర్పు నౌకాదళానికి వచ్చాయని.. యారాడ నౌకాదళం ప్రాంతంలో శిక్షణా కార్యక్రమాలు జరిగాయని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'యూపీలో ఐదు వేల మదర్సాలు మూసివేత!'
    ఉత్తర్​ప్రదేశ్​లో సుమారు 5వేల మదర్సాలను మూసివేయనుంది(madrasa closed) యోగి ఆదిత్యనాథ్ సర్కారు(UP Government). ఈ నిర్ణయంతో రాష్ట్రానికి రూ.100కోట్ల నిధులు మిగులుతాయని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వాట్సాప్ మెసేజ్​లు ట్రేస్ చేయొచ్చా?.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు
    కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్​ను సవాలు చేస్తూ వాట్సాప్​, ఫేస్​బుక్ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై స్పందించాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తాలిబన్ల చేతికి 'కిల్​ లిస్ట్​'.. ఇచ్చింది అమెరికానే!
    అఫ్గాన్​ వ్యవహారంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి(US afghanistan). ఇందుకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. ఇన్నేళ్లు తమకు సహాయం చేసిన అఫ్గానీల పేర్లతో కూడిన ఓ జాబితాను స్వయంగా అమెరికా వెళ్లి తాలిబన్ల చేతికి ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దేశాలకు క్రెడిట్​ రేటింగ్​ ఎలా ఇస్తారు? దాని అవసరం ఎంత?
    మూడీస్​, ఫిచ్ సహా వివిధ సంస్థలు దేశాలకు క్రెడిట్ రేటింగ్​ను ఇస్తుంటాయి. అంతేకాకుండా జీడీపీని అంచనా వేస్తుంటాయి. దేశాలు రుణాలు తీసుకోవడంలో ఈ రేటింగ్సే కీలకమా? ఒక దేశానికి రుణాలు ఇచ్చేందుకు వరల్డ్​ బ్యాంక్, ఐఎంఎఫ్​ వంటి సంస్థలు ఎలాంటి అంశాలను పరిగణిస్తాయి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇంగ్లాండ్ 432 ఆలౌట్.. భారత్​పై భారీ ఆధిక్యం
    భారత్​తో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 432 పరుగులకు ఆలౌటైంది ఇంగ్లాండ్. భారత్​ ముందు 354 పరుగులు ఆధిక్యాన్ని ఉంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రూట్​ సెంచరీలు​- బిగ్​బీ ట్వీట్​ వైరల్​
    2016లో ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​ను ఉద్దేశిస్తూ బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం​ ట్రోల్​ అవుతోంది. బిగ్​బీ ఆ ట్వీట్​ను డిలీట్​ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details