- ప్రాణాలు తీస్తోన్న కొరత..!
అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో నలుగురు కొవిడ్ బాధితులు మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో నలుగురు మృతి చెందడంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటిలేటర్ల కొరతతో మృతి చెందారని ఆరోపిస్తున్నారు. రోగులను వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆదేశాలు నిలిపివేత
కడప జువారి సిమెంట్ కంపెనీని మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24న పీసీబీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జువారి సిమెంట్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కొనసాగుతున్న విచారణ
తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను రాజమహేంద్రవరం అనిశా కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చిన అ.ని.శా. బృందం విచారణ చేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'టికెట్లు చూపించి వెళ్లవచ్చు'
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో చిత్తూరు జిల్లావ్యాప్తంగా పాకిక్ష కర్ఫ్యూ అమలులో ఉంది. దర్శన టికెట్లు చూపించి తిరుమలకు వెళ్లవచ్చని చిత్తూరు జిల్లా ఎస్పీ అప్పలనాయుడు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డీఎంకే అధినేత స్టాలిన్‌కు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ దురైమురుగన్‌తో కలిసి స్టాలిన్ గవర్నర్‌ను కలిశారు. పార్టీ శాసనసభాపక్షనేతగా తనను ఎన్నుకన్నట్లు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు లేఖను సమర్పించారు స్టాలిన్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు నివారించండి'