ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Building sagged: కుంగిన మూడంతస్తుల భవనం... ఎక్కడంటే..? - కడపలో కూలిన మూడంతస్తుల భవనం

Building sagged: కడపలో మూడంతస్తుల భవనం కుంగిపోయింది. భవనంలో ఉన్నవారు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఎలా జరిగిందంటే..?

Three storied building sagged
కుంగిన మూడంతస్తుల భవనం

By

Published : Sep 23, 2022, 12:57 PM IST

Building sagged: కడప కో ఆపరేటివ్ కాలనీలో కాలం చెల్లిన మూడంతస్తుల భవనం కుంగి పోయింది. సకాలంలో భవనం నుంచి బయటికి రావడంతో ప్రాణాపాయం తప్పింది. భవనానికి మరమ్మతు పనుల్లో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్​లో పనులు జరుగుతున్నాయి. మిగిలిన రెండు అంతస్తులలో కొందరు నివాసం ఉంటున్నారు. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భవనం కిందకు కుంగిపోయింది. అప్రమత్తమైన స్థానికులు భవనంలో నుంచి చాకచక్యంగా బయటికి వచ్చారు. కానీ మొదటి అంతస్తులో ఉన్న వారు బయటకు వచ్చేందుకు వీలుకాకపోవడంతో వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మొదటి అంతస్తులో ఇరుక్కుపోయిన కుటుంబాన్ని రక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే ఆస్తి నష్టం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details