కడప జిల్లా పులివెందులలో దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లోకి చొరబడి మహిళ కాళ్లు, చేతులు కట్టేసి బంగారంం, రూ.70 వేల నగదు ఎత్తుకెళ్లారు.
పులివెందులలో దొంగల బీభత్సం...మహిళ కాళ్లు, చేతులు కట్టేసి.. - కడపలో దొంగల బీభత్సం
10:03 September 13
మహిళను కట్టేసి బంగాలు గొలుసు, కమ్మలు అపహరణ
ఇంటి వెనుక నుంచి ప్రవేశించి..
పులివెందులలో క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో బాధితురాలు లక్ష్మీ నివాసం ఉంది. దొంగలు ఆమె ఇంటి వెనుక నుంచి చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న ఆమె కాళ్లు, చేతులు కట్టేసి బీరువాలో ఉన్న నగలు, డబ్బులు ఎత్తుకెళ్లారు. రెండు జతల కమ్మలు, రూ.70 వేల నగదు దొంగిలించారని లక్ష్మీ చెబుతున్నారు. ఘటనస్థలానికి చేరుకున్న ఎస్సై చిరంజీవి బాధితురాలి వివరాలు.. చోరీ జరిగిన తీరు తెలుసుకున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చదవండి:అధ్వానంగా నగర రహదారులు.. ఇక్కట్లు పడుతున్న ప్రజలు