వైద్యుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కడప తెదేపా నాయకులు జయచంద్ర డిమాండ్ చేశారు. వైద్యునిపై దాడిని ఖండిస్తూ కడప అంబేద్కర్ విగ్రహం ఎదుట తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా విపత్తు సమయంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు తమకు పరికరాలు లేవని..., వాటిని ఇవ్వాలని అడిగితే సస్పెన్షన్ చేసి దాడి చేయడం తగదని ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాక్షస పాలనకు ప్రజలు త్వరలోనే సమాధి కడతారని ఆయన స్పష్టం చేశారు.
వైద్యుడిపై దాడిని ఖండిస్తూ తెదేపా నాయకుల నిరసన - kadapa tdp leaders latest news
విశాఖలో వైద్యునిపై దాడిని నిరసిస్తూ కడపలో తెదేపా నాయకులు నిరసన తెలిపారు. వైద్యునిపై దాడికి దిగిన వారిని సస్పెండ్ చేయాలని కోరారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు.
![వైద్యుడిపై దాడిని ఖండిస్తూ తెదేపా నాయకుల నిరసన tdp protest on vizag doctor arrest at kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7234732-491-7234732-1589719278122.jpg)
అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా నాయకుల నిరసన