ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బుతో ఏం చేస్తున్నారు' - పన్ను పెంపు రద్దు చేయాలంటూ కడపలో తెదేపా ధర్నా

వైకాపా ప్రభుత్వం పన్నులు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని కడప తెదేపా నేతలు విమర్శించారు. పెంచిన పన్నుల డబ్బులతో ఏం సంక్షేమ కార్యక్రమాలు చేశారని నిలదీశారు. ఆస్తి పన్ను పెంపు జీవోను రద్దు చేయాలని కోరుతూ 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.

tdp leaders dharna
తెదేపా నేతల ధర్నా

By

Published : Dec 5, 2020, 4:06 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బులను ఎన్ని సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారో ముఖ్యమంత్రి చెప్పాలని కడప జిల్లా తెదేపా నేతలు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ ఆధారిత మున్సిపాలిటీ పన్నుల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ 12 గంటల నిరాహర దీక్ష చేపట్టారు. కడప పార్టీ కార్యాలయంలో తెదేపా పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, ఇతర నేతలు రాత్రి 8 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నారు. వీరికి సంఘీభావంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు.

వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రకాల పన్నులు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని నరసింహారెడ్డి విమర్శించారు. మద్యం ధరలు పెంచడం, కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, ఆస్తి పన్నులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇలా అన్ని రకాల పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని నేతలు ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details