ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh: కడప జైలులో ప్రవీణ్​కుమార్​రెడ్డిని పరామర్శించిన నారా లోకేశ్​

Nara lokesh in kadapa: కడప జైలులో ప్రవీణ్​కుమార్​రెడ్డిని తెదేపా నేత నారా లోకేశ్​ పరామర్శించారు. ప్రవీణ్​ కుమార్​ను కలిసేందుకు జైలు అధికారులు... 18 మందికి అనుమతి కల్పించారు. లోకేశ్​ పర్యటనపై పోలీసులు ఆంక్షలు, నోటీసులు జారీ చేశారు.

Nara lokesh in kadapa
ప్రవీణ్​కుమార్​రెడ్డికి తెదేపా నేత నారా లోకేశ్​ పరామర్శ

By

Published : Oct 18, 2022, 12:17 PM IST

Nara lokesh in kadapa: కడప కేంద్ర కారాగారంలో ఉన్న తెదేపా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంచార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పరామర్శించారు. ప్రవీణ్‌రెడ్డిని కలిసేందుకు 18 మందికి ములాఖాత్‌కు జైలు అధికారులు అనుమతి కల్పించారు. లోకేశ్‌, మరో 17 మందిని లోపలికి అనుమతించారు. జైలులో ఉన్న ప్రవీణ్‌, మరో ఐదుగురికి ములాఖత్‌లో కలిసే అవకాశం కల్పించారు.

లోకేశ్​ పర్యటనపై ఆంక్షలతో పాటు పోలీసులు నోటీసులు జారీచేశారు. చిన్న ఘటన జరిగినా జిల్లా తెదేపా నేతలదే బాధ్యత అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అంతకుముందు కడప విమానాశ్రయంలో లోకేశ్‌కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో పార్టీ ముఖ్యనేతలు, ఇన్‌ఛార్జులతో తాజా రాజకీయ పరిణామాలపై లోకేశ్​ చర్చలు జరిపారు.

ప్రవీణ్​కుమార్​రెడ్డికి తెదేపా నేత నారా లోకేశ్​ పరామర్శ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details