ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ లేక ప్రయాణికులు ఎండ వేడిమికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జగన్మోహన్ రెడ్డికి పట్టదా అని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రశ్నించారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ను వారం రోజుల క్రితం అధికారులు మూతవేశారన్నారు. కొత్త బస్టాండ్ నిర్మాణం పూర్తి కాకముందే పాతబస్టాండు మూసేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత బస్టాండ్ స్థలంలో కాంప్లెక్స్ నిర్మించాలనే ఉద్దేశంతో అధికారులు ఆర్టీసీ బస్టాండ్ మూసేశారన్నారు.
"సీఎం సొంత నియోజకవర్గంలోనే... ప్రజలు అవస్థ పడుతుంటే పట్టదా?" - పులివెందుల బస్టాండ్ మూసివేతపై తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆగ్రహం
పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ మూసివేతపై తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ మూసివేతతో ప్రజలు అవస్థ పడుతున్నారని బీటెక్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజలు అవస్థ పడుతుంటే పట్టదా? అని ప్రశ్నించారు.
తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి
ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం ఎండలో నిలబడి ఎదురు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందుల పట్టణంలో పర్యటించి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా ఆర్టీసీ బస్టాండ్ మూసేయడం దుర్మార్గమైన చర్య బీటెక్ రవి ఆరోపించారు.
ఇదీ చదవండి: RTC Bus Stand: అది పూర్తికాకముందే ఇది మూసేశారు... మండుటెండలో ప్రయాణికులు