TDP leaders protest: వైయస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం కొత్త గంగిరెడ్డి పల్లె ఇసుక క్వారీ వద్ద కొత్తూరు కిషోర్ కుమార్ రెడ్డి, తెదేపా మండల కన్వీనర్ గంగిరెడ్డి తెదేపా నాయకులు... రైతులతో కలసి ఇసుక ట్రాక్టర్లు, ట్రిప్పట్లను అడ్డుకొని ఆందోళన చేశారు. అనుమతులు ఒకచోట ఉంటే తవ్వకాలు మరోచోట చేస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మీటర్లోతు తవ్వాల్సి ఉండగా దానికి మించి ఎక్కువ లోతు తాగుతున్నారని ధ్వజమెత్తారు. సరైన బౌండరీస్ లేకుండా అక్రమంగా తవ్వుతున్నారని గ్రామస్థులు ట్రిప్పర్లు, ట్రాక్టర్లను అడ్డుకొని నిలిపివేశారు. నిర్ణీత బౌండరీలు లేకుండా ఎక్కడపడితే అక్కడ తవ్వి అధిక లోడుతో ఇసుక తీసుకువెళ్తున్నారని... రోడ్లు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అనుమతులు ఒక చోట.. తవ్వుకునేది మరోచోట.. ఇసుక తరలింపుపై తెదేపా ఆందోళన - వైఎస్సార్ జిల్లాలో తెదేపా నేతల ఆందోళన
TDP leaders protest: వైయస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం కొత్త గంగిరెడ్డి పల్లె ఇసుక క్వారీ వద్ద ఇసుక తరలింపు వాహనాలను తెదేపా నేతలు స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. ఒకచోట అనుమతులు తీసుకుని, వేరొక చోట ఇసుక తవ్వుకుంటుంటే.. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్థానికులు ట్రిప్పర్లను అడ్డుకున్నారు.
ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుకను తరలించాలని... కానీ ఇక్కడ జేపీ సంస్థ రేయింబవళ్లు ఇసుకను తరలిస్తూ అక్రమంగా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటుంటే అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నది వెంబడి ఉన్న పొలాలు కోతకు గురతున్నాయని, గుంతలు ఏర్పడిన చోట మూగజీవాలు, మనషులకు అపాయం ఏర్పడితే ఎవరు బాధ్యులు అని నిలదీశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేరే మార్గం ఎంచుకొని రవాణా చేసుకున్నట్లయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పెండ్లిమర్రి ఎస్సై రాజరాజేశ్వర్ రెడ్డి సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఇవీ చదవండి: