ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాషాయ దళంలోకి సాధినేని యామిని - tdp leader yamini sharma latest news

సాధినేని యామిని శర్మ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే తెదేపాను వీడిన ఆమె ఇవాళ కడపలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి గజేంద్రషెకావత్ సమక్షంలో పార్టీలో చేరారు.

tdp leader yamini sharma joined bjp in kurnool
కాషాయం కండువా కప్పుకున్న సాధినేని యామిని

By

Published : Jan 4, 2020, 5:29 PM IST

Updated : Jan 4, 2020, 6:55 PM IST

కాషాయ దళంలోకి సాధినేని యామిని

ఇటీవల తెదేపాను వీడిన సాధినేని యామిని శర్మ భాజపాలో చేరారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆమెకు పార్టీ కండువా కప్పి కమల దళంలోకి ఆహ్వానించారు. గతేడాది నవంబర్‌ మాసంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని... రాజీనామా చేసిన సందర్భంలో ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగతమైన, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన కారణాలతో తెదేపాను వీడుతున్నట్టు స్పష్టం చేసిన యామిని... తాజాగా భాజపాలో చేరారు.

ఇవీ చూడండి-పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భాజపా భారీ ర్యాలీ

Last Updated : Jan 4, 2020, 6:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details