ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెదేపా మద్దతుదారులకు ఓటువేస్తే దాడులు చేస్తారా..?' - Kadapa District Latest News

పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులకు ఓటు వేశారని దళితులపై దాడులు చేయడాన్ని.. తెదేపా నేత శ్రీనివాసులురెడ్డి ఖండించారు. దాడిచేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

శ్రీనివాసులు రెడ్డి
శ్రీనివాసులు రెడ్డి

By

Published : Mar 2, 2021, 4:13 PM IST

రాయచోటి మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుడికి ఓటు వేశారని దళితులపై వైకాపా నాయకుడు ప్రతాప్‌రెడ్డి దాడి చేయడం దారుణమని.. తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. నిన్న దాడి చేస్తే ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం సరికాదని విమర్శించారు. కడపలోని ఆయన కార్యాలయంలో శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడారు.

శ్రీనివాసులు రెడ్డి

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు ఎక్కువయ్యాయని శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. పోలీసులు దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా ఎప్పటికీ దళితుల పక్షాన ఉంటుందని, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... ఏడాదిగా సస్పెన్షన్ ఎలా కొనసాగుతుంది?: సుప్రీం కోర్టు

ABOUT THE AUTHOR

...view details