వైఎస్ వివేకా హత్య వెనకున్న(Viveka murder case) శంకర్‌రెడ్డి.. ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, వివేకా కుమార్తె సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సైతం శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిల ప్రస్తావన ఉందని పట్టాభి అన్నారు.
Viveka murder case: వివేకా హత్య కేసులో.. సీఎం జగన్‌ను విచారించాలి: పట్టాభి - వివేకా హత్య కేసు తాజా వార్తలు
వైఎస్ వివేకా హత్య కేసులో (Viveka murder case) సీఎం జగన్‌ను కూడా సీబీఐ విచారించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. వివేకా హత్య వెనకున్న శంకర్‌రెడ్డి.. ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని ఆరోపించారు.
tdp leader pattabhi
హత్య జరిగిన రోజున ఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలు తారుమారు చేసి గుండెపోటుగా చిత్రీకరించింది.. అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డిలేనని ఆరోపించారు. సిట్‌ను రెండుసార్లు మార్చి జగన్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని పట్టాభి ఆరోపించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలతోపాటు సీఎం జగన్‌ను కూడా సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: