TDP leader Narasimha Prasad: రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయాలని రాష్ట్ర తెదేపా సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ గత కొంత కాలంగా రైల్వేకోడూరులో ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. 'రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాలో ఉంచండి... లేదంటే తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాలో కలపండి' అని కడప జిల్లా చిట్వేల్ మండలం నాగవరంలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. పోలీసులు ఇంటిని చుట్టుముట్టి నరసింహ ప్రసాద్ అదుపులోకి తీసుకున్నారు.
TDP leader Narasimha Prasad: అన్నమయ్య నడయాడిన రాజంపేట, రైల్వే కోడూరు కాకుండా రాయచోటి కేంద్రంగా జిల్లా నిర్ణయించడం మంచిది కాదని నరసింహ ప్రసాద్ అన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటిగా ప్రకటిస్తే... పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా, జనసేన నాయకులు పాల్గొన్నారు.