ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాయలసీమ పౌరుషాన్ని తక్కువ అంచనా వేయొద్దు' - srisailam reservoir latest news

తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ప్రజల పౌరుషాన్ని తక్కువ అంచనా వేయవద్దని తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. శ్రీశైలం రిజర్వాయర్​ నుంచి 70 టీఎంసీల నీటిని తీసుకునే అధికారం ఆంధ్రప్రదేశ్​కు ఉందని చెప్పారు. తెలంగాణలో కృష్ణా నది మీద అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ప్రెస్​మీట్​
తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ప్రెస్​మీట్​

By

Published : Jun 2, 2020, 4:44 PM IST

తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ప్రజల పౌరుషాన్ని తక్కువ అంచనా వేయొద్దని తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్​కు రావాల్సిన మిగులు జలాలు అన్నింటిని ఉపయోగించుకునే హక్కు ఆంధ్రాకు ఉందన్నారు. కడప ప్రెస్​క్లబ్​లో ఆయన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కృష్ణా నది మీద అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్​ ఇద్దరు కలిసి లాలూచిపడి తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతానికి శ్రీశైలం రిజర్వాయర్ నీరు ఒక్కటే ఆధారమని పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్​ నుంచి 70 టీఎంసీల నీటిని తీసుకునే అధికారం ఆంధ్రప్రదేశ్​కు ఉందని చెప్పారు. ఈ విషయమై ఎలాంటి అభ్యంతరాలు చెప్పవద్దని ఆయన సూచించారు.

ఇదీ చూడండి:'సీఎం జగన్​ను సలహాదారులే పక్కదారి పట్టిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details