కడప జిల్లా రాయచోటిలోని ప్రభుత్వాసుపత్రిని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం పదిన్నర గంటలైనా వైద్య సిబ్బంది, ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సేవల కోసం వచ్చి క్యూలైన్లలో వేచి ఉన్న రోగులతో మాట్లాడారు. ఉద్యోగుల సకాలంలో హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఇకపై వైద్య సిబ్బంది 9 గంటలకే విధుల్లో ఉండాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధిపై వైద్య సిబ్బందితో చర్చించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ విప్ ఆకస్మిక తనిఖీ - రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ విప్ ఆకస్మిక తనిఖీ
కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిని చీఫ్ విప్ గడిగోట శ్రీకాంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యులు ఆలస్యంగా విధులకు హాజరుకావటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వఆసుపత్రిలో చీఫ్ విప్ ఆకస్మిక తనిఖీ
TAGGED:
రాయచోటి ఆసుపత్రి తాజా న్యూస్