కడపలో అనేక కాలనీలను... బుగ్గవంక మరోసారి బురద మయం చేసింది. నివర్ తుపాను ప్రభావంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి.... దాదాపు 30 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. నీటివిడుదలకు గంట ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని ముంపు బాధితులు ఆవేదన చెందారు. అంత తక్కువ సమయంలో.. ఇళ్ల నుంచి వెళ్లలేక పోయామని వాపోయారు. ఇళ్లలో బురద మేటలు వేసిందని... సామాన్లు పాడయ్యాయని కన్నీటి పర్యంతమయ్యారు. బుగ్గవంక ముంపు సమస్యకు.... పరిష్కారం చూపాలని అధికారులను వేడుకుంటున్నారు.
ముంచెత్తిన వరద... కడప నగరం బురద - బుగ్గవంక నీటి కారణంగా కడపలో నీట మునిగిన కాలనీలు
ఏ వీధి చూసినా అడుగు ఎత్తు బురదమయం.. ఏ ఇంటి తలుపు తెరిచినా తడిసిపోయిన ధాన్యం.. ఎవరిని పలకరించినా కన్నీరే.. కళ్ళెదుట వరద నీరు ఇళ్లలోకి వస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయత వారిది. కట్టుబట్టలతో బతుకు జీవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న వైనం. ఇదీ.. ప్రస్తుతం కడప నగర వాసుల పరిస్థితి.
కడపలో నీటమునిగిన పలు కాలనీలు