ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విహారయాత్రలో విషాదం.. నీటికుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి - పాలకొండలో విద్యార్థులు మృతి తాజా

పాలకొండలకు విహారయాత్రకు వెళ్లిన యువకులు ఇద్దరు మృత్యువాత పడ్డారు. నీటికుంటలోకి దిగి ఊపిరి ఆడక నాయబ్ రసూల్, అనిల్ కుమార్ చనిపోయారు.

students-died-in-palakonda-cadapa

By

Published : Nov 18, 2019, 10:30 AM IST

విహారయాత్రకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

కడప జిల్లా పాలకొండలో విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కడప హెలెన్ కెల్లర్ బదిరుల డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు... ఆదివారం సెలవు కావటంతో పాలకొండలకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ నీటికుంట ఉండటంతో నాయబ్ రసూల్, అనిల్ కుమార్ అను ఇద్దరు అందులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటం వల్ల ఊపిరి ఆడక ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న మిగిలిన విద్యార్థులు కేకలు వేయగా.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి వారిని రక్షించేలోపే యువకులు ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనతో విద్యార్థుల కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details