ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్​... విద్యార్థిని మృతి - కడప జిల్లా లేటెస్ట్​ అప్​డేట్స్​

Student dead: బద్వేలులో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్​ ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులను తెదేపా, వామపక్ష నాయకులు పరామర్శించారు.

Student dead
విద్యార్థిని మృతి

By

Published : Apr 1, 2022, 12:32 PM IST

Student dead: కడప జిల్లా బద్వేలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తున్న మునగల భవాని(14) అనే 9వ తరగతి విద్యార్థినిని బద్వేలులోని ఫైర్​ కార్యాలయం వద్ద ట్రాక్టర్ ఢీకొట్టింది. విద్యార్థిని ట్రాక్టర్ చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పేద విద్యార్థిని మృతిపై తెదేపా, వామపక్ష నాయకులు ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇదీ చదవండి:Money seized in private bus: ప్రైవేట్ బస్సులో రూ.2 కోట్లు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details