ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన 450 పేద కుటుంబాలను కారంపల్లి కుటుంబ సభ్యులు ఆదుకున్నారు. బాధితులకు దుప్పట్లు, టవళ్లు, సబ్బులు పంపిణీ చేశారు. కారంపల్లి సుబ్బారెడ్డి, ఆయన సతీమణి రామసుబ్బమ్మ జ్ఞాపకార్థం.. వారి కుమారులు మన్నూరు అశ్వత్థామ రెడ్డి, తేజమూర్తి రెడ్డి, భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కడప జిల్లా రాజంపేట మండలం పుల్లపుత్తూరు గ్రామం (help to Flood victims at Pulla Puthur)లో జరిగింది.
వర్షాల వల్ల నష్టపోయిన వారికి తమ తల్లిదండ్రుల పేరు మీదుగా పలు వస్తువులు పంపిణీ చేశామని కారంపల్లి సుబ్బారెడ్డి, రామసుబ్బమ్మ కుమారులు తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే.. వారికీ తక్షణ సాయం అందిస్తామని చెప్పి, మానవత్వాన్ని చాటుకున్నారు.