ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Land Scam: బద్వేలులో నకిలీ భూదందా... ఆరుగురు అరెస్ట్ - వైఎస్సార్​ జిల్లాలో నకిలీ భూదందా ముఠాకు చెందిన ఆరుగురు అరెస్ట్

Fake land Business: బద్వేలులో నకిలీ భూదందా ముఠాకు చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సీళ్లు, నకిలీ అనుబంధ ఫారాలు, నకిలీ ఇంటి స్థలాల పట్టాలు, పాస్‌ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

Six persons arrested
నకిలీ భూదందా ముఠా అరెస్ట్

By

Published : May 16, 2022, 7:36 PM IST

Fake land Business: వైఎస్సార్ జిల్లా బద్వేలులో సంచలనం సృష్టించిన నకిలీ భూదందాలో కీలక పాత్ర పోషించిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో నకిలీ పత్రాలు, రెవెన్యూ సీళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పాత డీకేటీ పత్రాలకు నకిలీలను సృష్టించి.. వాటిని విక్రయించేవారని పోలీసులు తెలిపారు. కొంత కాలంగా ఇలా నకిలీ పత్రాలతో భూదందాలు సాగిస్తున్నారని వెల్లడించారు. రమణారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విచారణ చేపట్టగా ఈ విషయాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి సీళ్లు, నకిలీ అనుబంధ ఫారాలు, నకిలీ ఇంటి స్థలాల పట్టాలు, పాస్‌ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో తప్పించుకున్నవారి కోసం గాలింపు చేపడుతున్నట్లు వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

నకిలీ భూదందా ముఠా అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details