ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Six buses were burnt in Fire Accident : బస్సులో అకస్మాత్తుగా మంటలు...దగ్ధమైన మరో ఐదు బస్సులు... - ప్రొద్దుటూరులో బస్సులో మంటలు

Six buses were burnt in Fire Accident : కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ బస్సులో మంటలు చెలరేగి వ్యాపించడంతో మొత్తం ఆరు బస్సులు దగ్ధమయ్యాయి.

Six buses were burnt in Fire Accident
బస్సులో అకస్మాత్తుగా మంటలు...దగ్ధమైన మరో ఐదు బస్సులు...

By

Published : Jan 26, 2022, 10:34 AM IST

Six buses were burnt in Fire Accident : కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి...మొత్తం ఆరు బస్సులు దగ్ధమయ్యాయి. ఆటోనగర్‌లో మరమ్మతుల కోసం వచ్చిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . పక్కనే ఉన్న మిగిలిన బస్సులకు వ్యాపించాయి . ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన ఒక ట్రావెల్ బస్సు , సీబీఐటీ కళాశాలకు చెందిన మరో బస్సు మంటల ధాటికి పూర్తిగా కాలిపోయాయి. వాటి పక్కన ఉన్న మరో నాలుగు ఆర్టీసీ హైర్ బస్సులకూ మంటలు అంటుకున్నాయి . అగ్నిమాపక సిబ్బంది సంఘనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అర్పివేశారు. 20 లక్షల వరకూ నష్టం జరిగి ఉంటుందని షెడ్ నిర్వాహకులు చెబుతున్నారు . దుండగులు ఎవరైనా బస్సులకు నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు .

బస్సులో అకస్మాత్తుగా మంటలు...దగ్ధమైన మరో ఐదు బస్సులు...

ABOUT THE AUTHOR

...view details