కడప జిల్లా బ్రహ్మంగారి మఠం(Brahmamgari Matam) పీఠాధిపతి వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 12వ పీఠాధిపతిగా దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి అర్హత ఉందని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వెల్లడించారు. పీఠాధిపతి అర్హత అనేది వారసత్వంగా వచ్చే హక్కని వెంకటాద్రి స్వామికి అన్ని అర్హతలు ఉన్నాయని శివ స్వామి స్పష్టంచేశారు.
'పీఠాధిపతి రెండో భార్య వద్ద ఉన్న వీలునామా చెల్లదు. రెండో భార్య చూపించింది బలవంతపు వీలునామాగా గుర్తించాం. వారసత్వంగా పెద్ద కుమారుడికే పీఠాధిపత్యం ఉంటుంది. పీఠాధిపతి మరణంపైనా అనేక అనుమానాలు ఉన్నాయి. పీఠాధిపతిని హత్య చేసి ఉంటారని అనుమానంగా ఉంది. ఆరోగ్యంగా ఉన్న పీఠాధిపతి రెండ్రోజుల్లో ఎలా మరణిస్తారు..?'- శివస్వామి, శైవక్షేత్రం పీఠాధిపతి
ఇదీ చదవండి:Brahmamgari Matham: అలజడులు సృష్టించేందుకు శివస్వామి కుట్ర.. డీజీపీకి మహాలక్ష్మీ లేఖ