ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 4, 2022, 1:35 PM IST

ETV Bharat / city

దిసీజ్ వెరీ దారుణం.. సజ్జల ప్రసంగిస్తుండగా కరెంటు కోసేశారు!

SAJJALA: విద్యుత్ కోతల ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా ఎదురయ్యింది. వైఎస్సార్​ జిల్లాలోని ఏపీఎన్జీవో సహకార గృహనిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు నిర్మించుకున్న బహుళ అంతస్తుల భవన ప్రారంభోత్సవానికి సజ్జల హాజరయ్యారు. ఆయన ప్రసంగం మొదలుపెట్టిన పది నిమిషాలకు కరెంటు పోయింది.

SAJJALA
సజ్జల ప్రసంగంలో "పవర్​ కట్​"

SAJJALA: విద్యుత్ కోతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అసహనాన్ని తెప్పించాయి. కడప ఏపీఎన్జీవో సహకార గృహనిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు నిర్మించుకున్న బహుళ అంతస్తుల భవన ప్రారంభోత్సవానికి సజ్జల హాజరయ్యారు. ఆయన ప్రసంగం మొదలుపెట్టిన పది నిమిషాలకు కరెంటు పోయింది. వెంటనే జనరేటర్ ఆన్ చేశారు. జనరేటర్ కూడా నాలుగైదు సార్లు ఆగిపోవడంతో ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. కరెంటు వస్తుందో రాదోనని ఆలోచిస్తుండగా జనరేటర్ ఆన్ కావడంతో ప్రసంగాన్ని కొనసాగించారు.

సజ్జల ప్రసంగంలో "పవర్​ కట్​"

రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. అంతమాత్రాన వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. సమస్యలను పరిష్కరించాలనే చూస్తున్నాం తప్ప, సమస్యలను తప్పించాలని చూడటం లేదన్నారు. ఉద్యోగులకు - ప్రభుత్వానికి మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉందని.. దానిని అలాగే కొనసాగించాలని ఆయన సూచించారు. ఉద్యోగులను రాజకీయంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details