కడప డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ సోమవారం రాత్రి 11 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులో 35 మంది ప్రయాణికులతో కడప నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లాడు. బస్సును ఇష్టారీతిన వేగంగా నడుపుతుండటంతో ప్రయాణికులు ఆయన్ను మందలించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ సమీపంలో బస్సును రోడ్డుపై వదిలేసి డ్రైవర్ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆర్టీసీ అధికారులు, పోలీసులకు ప్రయాణికులు ఫిర్యాదు చేయగా... వారు మరో డ్రైవర్‌ను పంపి బస్సును గమ్యస్థానానికి చేర్చారు.
బస్సును వదిలేసి వెళ్లిన ఆర్టీసీ డ్రైవర్... ఏం జరిగింది..? - వైయస్‌ఆర్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ నిర్వాకం
ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చాల్సిన ఆర్టీసీ డ్రైవర్ అర్ధరాత్రి సమయంలో మార్గమధ్యలో బస్సును ఆపేసి వెళ్లిపోయిన ఘటన వైయస్‌ఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ తర్వాత అతడి ఆచూకీ తెలియరాలేదు. అసలేం జరిగిందంటే..?

ఆర్టీసీ డ్రైవర్
ఈ విషయంపై ఆర్టీసీ వైయస్‌ఆర్ జిల్లా రవాణా అధికారి గోపాల్‌రెడ్డిని వివరణ కోరగా.. డ్రైవర్ మార్గమధ్యలో బస్సును నిలిపేసి వెళ్లింది వాస్తవమేనన్నారు. ఇప్పటికీ అతని ఆచూకీ తెలియరాలేదని.. ఏం జరిగిందో తెలుసుకుంటున్నామన్నారు.
ఇవీ చదవండి: