ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Robbery: సీసీ కెమెరాలకు రంగుపూసి ఏటీఎం కొట్టేశారు.. పోలీసులు ఊరుకుంటారా? - ఏటీఎంలో నగదు చోరీ

Robbery: కడప నగరంలో ఈనెల 7వ తేదీన రెండు ఏటీఎంలను పగలగొట్టి 41 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన హర్యాన ముఠాను కడపజిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

Robbery
Robbery

By

Published : Dec 12, 2021, 7:51 PM IST

Robbery: కడప నగరంలో రెండు ఏటీఎంలను పగలగొట్టి 41 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన హర్యాన ముఠాను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 7న దొంగలు కడప శివారులోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల, రామాంజనేయపురం వద్ద ఉన్న రెండు ఏటీఎంలను కొల్లగొట్టారు. తెల్లవారుజామున గ్యాస్ కట్టర్లతో తొలగించి.. కేవలం నిమిషాల్లోనే రూ.41 లక్షలు కాజేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం 4 బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు.. హరియాణా, రాజస్థాన్, దిల్లీకి వెళ్లినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. హరియాణాకు చెందిన ప్రధాన నిందితులు ఇద్దరిని పట్టుకున్నామని వెల్లడించారు.

నిందితుల నుంచి రూ.9.5 లక్షల నగదు, 2 నాటు తుపాకులు, 20 కిలోల గంజాయి, 40 మద్యం బాటిళ్లు, గ్యాస్ కట్టర్, రెండు నిచ్చెనలు, అత్యాధునికమైన పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

చోరీకి కారులో వచ్చిన దొంగలు.. చోరీ అనంతరం కారును కంటైనర్​లో తీసుకుని హైదరాబాద్​ వెళ్లారని, అక్కడి నుంచి హరియాణా వెళ్లిపోయారని ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, 30 మంది సభ్యుల పోలీసు బృందాలు హరియాణా వెళ్లి నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులనూ త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

ఈ చోరీ నిందితులపై రాజస్థాన్లోనూ పది కేసులు ఉన్నాయన్న ఎస్పీ.. ఇటీవల తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లోనూ ఇదే తరహా ఏటీఎం దొంగతనాలు జరిగాయని వెల్లడించారు. ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరాలకు రంగు పూసి చోరీ చేస్తుంటారని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:గుంటూరు : అక్కను హత్య చేసిన తమ్ముడు.. భార్యపై దాడి చేస్తుండగా ఘటన

ABOUT THE AUTHOR

...view details