ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇలాంటి అధికారుల వల్ల జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు కావు' - రాయలసీమ జిల్లాల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

రాయలసీమ జిల్లాల ఆర్జేడీ..ప్రధానోపాధ్యాయులను వేధిస్తున్నారని ఆ జిల్లాల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి అన్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా మెమోలు జారీ చేయడం దారుణమని అన్నారు.

రాయలసీమ జిల్లాల ఉపాధ్యాయ సంఘం
రాయలసీమ జిల్లాల ఉపాధ్యాయ సంఘం

By

Published : Nov 8, 2021, 5:34 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్య అభివృద్ధి కోసం ప్రవేశపెడుతున్న పథకాలను కిందిస్థాయి అధికారులు తూట్లు పొడుస్తున్నారని రాయలసీమ జిల్లాల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ఏ ఆర్జేడీ చేయని విధంగా ప్రస్తుతమున్న రాయలసీమ జిల్లాల ఆర్జేడీ.. ప్రధానోపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేసి పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి అధికారుల వల్ల జగన్మోహన్ రెడ్డి పథకాలు సరైన స్థాయిలో అమలు కావని పేర్కొన్నారు.

ఆర్జేడీ నియంత పోకడలను వ్యతిరేకిస్తూ, ప్రధానోపాధ్యాయులకు జారీ చేసిన మెమోలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. కడప ఆర్జేడీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రతి చిన్న విషయానికి కూడా మెమోలు జారీ చేయడం దారుణమని అన్నారు.

ఆర్థికంగా వారి వేతనాలు తగ్గిస్తూ శిక్షలను గురిచేయడం ఆర్జేడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. వివిధ రకాల యాప్ లతో ప్రధానోపాధ్యాయులకు తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఆర్జేడి తన నియంత పోకడలను విడనాడ కుంటే రాయలసీమ వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి:Minister Buggana:'పెట్రో ధరలపై కేంద్రం తీసుకున్నంత సులభంగా నిర్ణయం తీసుకోలేం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details