కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి కలెక్టర్ విజయ రామరాజును కలిశారు. రాజంపేటను జిల్లాకేంద్రం చేయాలని వినతిపత్రం అందించారు. దీనికి సంబంధించి గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని ఎందుకు మార్చారో అర్థం కావడం లేదని మేడా అన్నారు.
రాజంపేట నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వివరించనున్నట్లు పేర్కొన్నారు. రాజంపేట జిల్లా కేంద్రం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.