వరుస తుపానులతో కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ గ్యారేజ్‌లో వరద నీరు చేరటంతో ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల మరమ్మతులు చేసే గ్యారేజిలోకి రెండు అడుగుల మేర నీరు చేరింది. మోటార్లు పెట్టి నీటిని బయటికి పంపిస్తున్నా... ఊట రూపంలో నీరు రోజురోజుకు అంతకంతకు పెరిగిపోతోంది. గ్యారేజి బురదమయం కావడంతో... బస్సులకు మరమ్మతులు చేయడం కష్టంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు సక్రమంగా అందడం లేదు. ఇప్పటికైనా ఆర్టీసీ గ్యారేజ్‌లోకి నీరు చేరకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
వరుస వర్షాలు.. ఆర్టీసీ గ్యారేజ్‌లో నిలిచిన వరద నీరు - బద్వేల్ ఆర్టీసీ గ్యారేజ్ లోకి చేరిన వరద నీరు
నివర్ తుపాను నష్టపరిచిన ఘటనలు మర్చిపోకముందే బురేవి తుపాన్ తన ప్రతాపం చూపిస్తోంది. వీటి ధాటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు... ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఆర్టీసీ బస్ స్టాండ్లు, గ్యారేజీలలో వరద నీరు చేరి ఆర్టీసీ సేవలకు అంతరాయం కలుగుతోంది.
ఆర్టీసీ గ్యారేజ్ లోకి వరద నీరు