YS Viveka Murder Case: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితుల రిమాండు గడువు మరోసారి కోర్టు పొడిగించింది. కడప జైల్లో జ్యూడిషియల్ రిమాండులో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిల రిమాండు గడువు ఈనెల 25వ తేదీ వరకు పొడగిస్తూ పులివెందుల మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ముగ్గురు నిందితులను కడప జైలు నుంచే ఆన్ లైన్ ద్వారా పులివెందుల మెజిస్ట్రేట్ ముందు అధికారులు హాజరుపరిచారు. వారి ముగ్గురికి మరోసారి 14 రోజుల పాటు రిమాండు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ పొడిగింపు - Pulivendula court
YS Viveka Murder Case:వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇందులో శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఉన్నారు.
YS Viveka Murder Case