నందం సుబ్బయ్యను హత్య చేయించారన్న ఆరోపణలను.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఖండించారు. హత్యారోపణలు చేస్తున్న నారా లోకేశ్... ప్రొద్దుటూరులో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకొని, ఊరొదిలి వెళ్తానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
'నారా లోకేశ్ నాపై గెలిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..' - tdp leader subbaiya murder case latest news
నారా లోకేశ్ కడప జిల్లా పొద్దుటూరులో తనపై పోటీ చేసి గెలవాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. తెదేపా నేత సుబ్బయ్య హత్య కేసులో తనపై నారా లోకేశ్ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.
prodhuturu mla siva prasad reddy