కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ.రమణారెడ్డి(80) చికిత్స పొందుతూ ( Proddatur Ex mla mv Ramana reddy passad away) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. డాక్టర్ ఎంవీ.రమణారెడ్డి(Dr mv Ramanareddy died) మరణ వార్త తెలుసుకున్న వెంటనే రాయలసీమ ఉద్యమకారులు.. ఆస్పత్రి వద్దకు చేరుకొని వారి పార్థివదేహానికి నివాళి అర్పించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. రమణారెడ్డి మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.
డాక్టర్. ఎంవీ రమణారెడ్డి బహుముఖ ప్రజ్ఞశాలి. రాయలసీమ ఉద్యమ నాయకుడు. 1983లో రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను విభేదించి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. రాయలసీమ విమోచనా సమితి ఏర్పాటు చేశారు. రాయలసీమ సమస్యల తక్షణ పరిష్కారం కోరుతూ..1985 నుంచి రమణారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాయలసీమలోని కరవు, దారిద్య్రాన్ని శాశ్వతంగా నివారించడానికి పలు డిమాండ్లు చేశారు. ఎమ్మెల్యేగా పనిచేస్తూనే.. న్యాయ విద్యాను అభ్యసించి పీడిత ప్రజల తరపున కోర్టుల్లో న్యాయ పోరాటం చేసిన గొప్ప మానవతావాది.