Sainik School: ప్రైవేటు రంగంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరులోని పూజ ఇంటర్నేషనల్ పాఠశాలను ఎంపిక చేసింది. గతేడాది డిసెంబరులో సైనిక్ పాఠశాలకు దరఖాస్తు చేసుకోవడంతో ప్రొద్దుటూరు వచ్చి పరిశీలించిన కేంద్ర రక్షణ శాఖ అధికారులు అన్ని సౌకర్యాలు ఉన్న పూజ ఇంటర్నేషనల్ పాఠశాలను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీంతో ప్రభుత్వం అధికారికంగా ప్రొద్దుటూరుకు ప్రైవేటు సైనిక్ పాఠశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఇదే మెుట్టమెుదటి ప్రైవేటు సైనిక్ స్కూల్ కావడం విశేషం. ప్రభుత్వ కోటా కింద 40 శాతం, యాజమాన్య కోటా కింద 60 శాతం సీట్లను భర్తీ చేయనున్నారు. సైనిక్ పాఠశాల ఏర్పాటుపై కడప జిల్లా విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sainik School: రాష్ట్రంలో మెుట్టమెుదటి ప్రైవేటు సైనిక్ స్కూల్.. ఎక్కడంటే ? - పూజ ఇంటర్నేషనల్ పాఠశాల
Sainik School: ప్రైవేటు రంగంలో దేశ వ్యాప్తంగా 100 సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ జాబితాలో కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరులోని పూజ ఇంటర్నేషనల్ పాఠశాల ఎంపికైంది.
దేశ వ్యాప్తంగా 100 సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా శనివారం మొదటి విడతగా 21 పాఠశాలలకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో ఏపీ నుంచి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరులోని పూజ ఇంటర్నేషనల్ స్కూల్, తెలంగాణ నుంచి కరీంనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ సైనిక స్కూల్‌కు స్థానం దక్కింది. అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (ఏఐఎస్‌ఎస్‌ఈఈ) ద్వారా కొన్ని సీట్లను భర్తీ చేస్తారు. మిగతా వాటికి ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. వీటిల్లో అర్హత సాధించిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పాఠశాలల్లో ఫీజులను గరిష్ఠంగా రూ.40వేలుగా నిర్ణయించనున్నారు. ఆరో తరగతిలో ప్రవేశాలు పొందిన వారిలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 50శాతం మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫీజులను చెల్లిస్తుంది. ఒక్కో పాఠశాలకు గరిష్ఠంగా రూ.20లక్షల వరకు మాత్రమే ఇస్తుంది.
ఇదీ చదవండి: Wedding bus accident: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా... మహిళ, చిన్నారి సహా ఏడుగురు మృతి