కడపలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇకపై కొవిడ్ చికిత్స అందించబోమని వాటి యాజమాన్యాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. రెండు రోజుల కిందట విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి... రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న రెండు ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఈ మేరకు ప్రైవేటు వైద్యులు ఏకమై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని.. ఇక నుంచి తమ ఆస్పత్రుల్లో కొవిడ్ వైద్యం చేయబోమంటూ తీర్మానం చేశారు. ఇలా చేయడం పట్ల కొంతమంది నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించారు.