ఈనెల 16న భారీ ఎత్తున నిరసన చేపడుతున్నట్లు కడప విద్యుత్ ఉద్యోగుల ఐకాస కన్వీనర్ చలపతి తెలిపారు. తమ సమస్యల గురించి ప్రభుత్వంతో 3 సార్లు చర్చలు జరిపినప్పటికీ స్పందన లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీపీపీని మూసివేయటంతో కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ వలన ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. సోమవారం కడప విద్యుత్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
సోమవారం పెద్దఎత్తున విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
సోమవారం కడపలో విద్యుత్ ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. విద్యుత్ ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.
చలపతి, విద్యుత్ ఉద్యోగుల ఐకాస కస్వీనర్