ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులను కడప రిమ్స్ పోలీసులు కాపాడారు. స్థానిక రైల్వే ట్రాక్ వద్ద అనంతపురం జిల్లాకు చెందిన ఖాజా పీర్ అనే వ్యక్తి, అతని ప్రేయసి బలవన్మరణానికి పాల్పడ్డారు. అతడు పురుగుల మందు సేవించగా.. యువతి మాత్రం తాగలేదు. మరణించే ముందు అతడు స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. మిత్రులు వెంటనే పోలీసులను అప్రమత్తంగా చేయగా.. వారిద్దరినీ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఖాజా పీర్ కోలుకుంటున్నాడు. యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇదివరకే పెళ్ళై, ఇద్దరు పిల్లలు ఉన్న ఖాజా పీర్.. ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం బయటికి తెలిస్తే సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో.. ప్రియురాలిని కడపకు తీసుకు వచ్చాడు. రిమ్స్ పరిధిలోని రైల్వేట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించగా.. పోలీసులు అప్రమత్తమై వారున్న ప్రదేశాన్ని గుర్తించి ఆస్పత్రిలో చేర్చారు.