ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PD ACT: ఘరానా మోసగాడు ప్రసన్న కుమార్‌పై పీడీయాక్ట్ - ఘరానా మోసగాడు ప్రసన్న కుమార్‌పై పీడీయాక్ట్

సామాజిక మాధ్యమాల ద్వారా అనేక మంది మహిళలను వేధించిన నిందితుడిపై కడప జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిందితుడిపై 26 కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

PD ACT
PD ACT

By

Published : Oct 17, 2021, 10:48 AM IST

సామాజిక మాధ్యమాల ఆధారంగా పదుల సంఖ్యలో మహిళలను మోసగించి నేరాలకు పాల్పడిన కడప జిల్లాకు చెందిన ఘరానా మోసగాడు ప్రసన్నకుమార్‌పై పీడీ యాక్టు ప్రయోగించారు. ఈ విషయాన్ని జిల్లా పోలీసు అధికారి అన్నురాజన్‌ వెల్లడించారు. ప్రొద్దుటూరు పట్టణం గీతాశ్రమం వీధికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్‌ అలియాస్‌ రాజారెడ్డి అలియాస్‌ టోనీ కడప విజయవాడ, హైదరాబాదు నగరాల్లో షేర్‌చాట్‌, ఫేస్​బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలను, లక్ష్యంగా ఎంచుకుని వారితో పరిచయం పెంచుకునేవాడు.

ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి వారితో అసభ్యకర రీతిలో చాటింగ్‌ చేసేవాడు. వారికి తెలియకుండా వారు నగ్నంగా ఉన్న చిత్రాలు, వీడియోలను రికార్డు చేసి వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. మరి కొంతమందిని శారీరకంగా కూడా అనుభవించడంతోపాటు వారి నుంచి డబ్బులు, బంగారు అభరణాలు కూడా తీసుకెళ్లి వాటిని అమ్మి జల్ఫాగా తిరిగేవాడు. ఈ విధంగా పదుల సంఖ్యలో మహిళలను మోసగించాడు. బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని చాలామంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. ఇంతే కాకుండా.. చాపాడు, ప్రొద్దుటూరు పరిధిలోని ఠాణాల పరిధిలో ఇతనిపై దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి. 2019లో ప్రొద్దటూరు ఒకటో పట్టణఠాణా పరిధిలో క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో, 2020 నవంబరులో తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్‌ పరిధి చౌదరిగూడెం రాఠా పరిధిలో ఒక వివాహితను లైంగికంగా వేధించి డబ్బుల కోసం బెదిరించాడు.

2020 విజయవాడలో కమిషనరేట్‌ పరిధిలో పెనమలూరు ఠాణా పరిధిలో కూడా ఓ వివాహితను లైంగికంగా వేధించాడు. జిల్లాలో కడప, ఎర్రగుంట్ల, వల్లూరు ప్రాంతాల్లో పలు నివాసాల్లో చోరీలకు పాల్పడ్డాడు. కడప, ప్రొద్దుటూరు పరిధిలో ద్విచక్రవాహనాల చోరీ కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 కేనులు..
ప్రసన్నకుమార్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 కేసులు ఉన్నాయి. ప్రసన్నకుమార్‌ బాల్యం నుంచే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. బీ.టెక్‌ మొదటి సంవత్సరంలోనే చదువు మానేశాడు. జల్సాలకు అలవాటు పడి 2017లోనే గొలుసు చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి మళ్లీ బయటికివచ్చాడు. ప్రొద్దుటూరు మూడో పట్టణ ఠాణా పోలీసులు ఈయనపై అనుమానాస్పద షీటు తెరిచారు. ప్రసన్నకుమార్‌ వల్ల ఎంతో మంది మహిళలు లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో 26 కేసులు నమోదయ్యాయి. అతనిపై పీడీ యాక్టు ప్రయోగించాలని ఎస్పీ అన్సురాజన్‌ కలెక్టరు విజయరామరాజుకు సిఫార్సు చేశారు. ఈ మేరకు కలెక్టరు ప్రసన్నకుమార్‌పై శనివారం పీడీ యాక్ట్ ప్రయోగించి కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

DL RAVINDRA REDDY: పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పోటీచేస్తా..

ABOUT THE AUTHOR

...view details