ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటినుంచి పారిపోయిన తల్లీపిల్లలు.. 2 నెలల తరువాత గుర్తింపు - crack missing a woman and three childrens case at kadapa

ఇంటి నుంచి పారిపోయిన తల్లి, ముగ్గురు పిల్లలను రెండు నెలల తరువాత గుర్తించిన కడప పోలీసులు.. ఆ కుటుంబీకులకు అప్పగించారు. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులోఉన్నట్లు చరవాణి ఆధారంగా గుర్తించారు.

mother to the family
తల్లీపిల్లలను కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు

By

Published : Jun 20, 2021, 10:45 AM IST

కడపలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటినుంచి పారిపోయిన ఓ తల్లి ముగ్గురు పిల్లలను కడప పోలీసులు గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. కడప రవీంద్ర నగర్​కు చెందిన షేక్ ఆరిఫున్.. తన ముగ్గురు పిల్లలు షేక్ గౌసియా, షేక్ సోఫియా, షేక్ అబ్దుల్ రహీంతో మే 28న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు. వారి వద్ద ఉన్న ఫోన్ ఆధారంగా బంగ్లాదేశ్- భారత సరిహద్దులో ఉన్నట్లు రెండు నెలల తరువాత గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందం అక్కడకు చేరుకొని వాళ్లను కడపకు తీసుకొచ్చి వారి బంధువులకు అప్పగించారు. దీంతో ఆ కుటంబీకులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

దారి తెలియక వెళ్లారు..

ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వాళ్లు మొదట ముంబై... అక్కడినుంచి పశ్చిమ బెంగాల్​కు వెళ్లారు. దారి తెలియని పరిస్థితిలో చివరకు భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులోని టాకీ అనే గ్రామానికి చేరుకున్నారు.

ఇదీ చదవండి:

DGP Twitter: డీజీపీ పేరుతో నకిలీ ఖాతా కేసు.. దర్యాప్తులో సహకరించని ట్విటర్!

ABOUT THE AUTHOR

...view details