Smugglers arrest కడప పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఏడుగురు తమిళ ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎర్రచందనం దుంగలు స్వాధీన పరుచుకున్నారు. సిద్ధవటం వైపు నుంచి నాలుగు చక్రాల వాహనాల్లో స్మగ్లర్లు... ఎర్రచందనం దుంగలు వేసుకొని వెళ్తుండగా జేఎంజే కళాశాల వద్దకు రాగానే పోలీసులను చూసి స్మగ్లర్లు వాహనాన్ని వదిలేసి సమీపంలోని పాలకొండలోకి పరుగులు తీశారు. పోలీసులు స్మగ్లర్లను వెంబడించారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన చేజింగ్లో ఎట్టకేలకు ఏడుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వీరిని విచారిస్తున్నారు.
Smugglers arrest ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ - ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్
Smugglers arrest కడప జిల్లాలో ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రచందనం