Great Poet Molla: మహా కవయిత్రి మొల్ల అన్నా, మొల్ల రామాయణం అన్నా...తెలియని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. ఆ మహా కవయిత్రి సాహిత్యాన్ని భావి తరాలకు అందించేందుకు గానూ...కడప జిల్లా రాజంపేటలో నేటి నుంచి 13వ తేదీ వరకూ మొల్ల సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
Great Poet Molla: కవయిత్రి మొల్ల సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు - Poet Molla Literary Cultural Festivals at Rajampet
Great Poet Molla: మహా కవయిత్రి మొల్ల నివాసం ఉన్న కడప జిల్లా రాజంపేటలో నేటి నుంచి 13వ తేదీ వరకూ మొల్ల సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. కాల గర్భంలో కలిసిపోతున్న నాటి చారిత్రక సంపదను భావి తరాలకు అందించేందుకు గానూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మరో వైపు కవయిత్రి మొల్ల నివసించిన కడప జిల్లా పెద్ద గోపవరం ప్రాంతంలో ఎంతో విలువైన చారిత్రక సంపద గర్భంలో కలిసి పోతున్నాయి. మొల్ల ఆరాధ్య దైవమైన శ్రీ కంఠ మల్లేశ్వర ఆలయం, స్నానం మాచరించిన కోనేరు శిథిల దశకు చేరుకున్నాయి. ఆ మహనీయురాలు నివసించిన పూరిపాక ఆదరణ లేక నిర్లక్ష్యానికి లోనయింది. మొల్ల నడయాడిన పరిసరప్రాంతాలు పేడ దిబ్బలు గడ్డివాముల మధ్య నలిగిపోతూ నిరాదరణకు లోనవుతోంది. అధికారులు,పాలకులు స్పందించి కాలగర్భంలో కలిసిపోతున్న విలువైన చరిత్రను భావితరాలకు అందించాలని గోపవరం ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి :Radharani Success Story: క్రీడాదుస్తుల వ్యాపారంలో దూసుకెళ్తున్న రాధా రాణి.. నైపుణ్యాలతో పలు అవార్డులు
TAGGED:
Great Poet Molla