ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మా వద్దే పెట్రోల్ కొనండి.. రేట్లు తగ్గిస్తూ బంకుల ఆఫర్లు..! - కడపలో పెట్రోల్​ ధర తగ్గిస్తూ బోర్డులు పెట్టిన యజమానులు

Petrol prices reduced: ఓ వైపు చమురు ధరలు పెరిగిపోతున్నాయని సామాన్యూలు లబోదిబోంటున్నారు. పెట్రోల్​, డీజిల్​ మాటెత్తితేనే బంబేలెత్తిపోతున్నారు. కానీ.. కడపలో రెండు పెట్రోల్​ బంక్​ల మధ్య నెలకొన్న పోటీ.. వినియోగదారులకు ఊరటనిస్తోంది!

Petrol prices reduced
పెట్రోల్​ తగ్గింపు బోర్డులు

By

Published : May 21, 2022, 7:00 AM IST

ధర తగ్గింపు అంటూ ఇప్పటి వరకు రాష్ట్ర సరిహద్దుల్లోని పెట్రోలు బంకులకే పరిమితమైన బోర్డులు.. కడపలోని రెండు బంకుల్లోనూ వెలిశాయి. తమ వద్ద లీటర్‌కు 2 రూపాయలు తక్కువ ధర అని హెచ్​పీ పెట్రోలు బంక్‌ ఎదుట బోర్డు పెట్టగా... దీనికి పోటీగా ఎస్సార్‌ పెట్రోలు బంక్‌ వాళ్లు లీటర్‌కు 2.40 రూపాయలు తగ్గిస్తామంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. రాజంపేట వెళ్లే మార్గంలోని ఈ రెండు పెట్రోలు బంక్‌లు పోటీపడటం వినియోగదారులకు కలిసి వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details