ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాను జయించినా.. బ్లాక్‌ ఫంగస్‌ ముందు ఓడిపోయాడు! - kadapa district news

అతను కరోనాను జయించాడు. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. అంతలోనే బ్లాక్‌ ఫంగస్‌ పంజా విసిరింది. కంటి నుంచి మొదలై మెదడుకు వ్యాపించి బలితీసుకుంది. చిన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

covid recovered patient died of black fungus
బ్లాక్‌ ఫంగస్‌ ముందు ఓడిపోయాడు

By

Published : May 19, 2021, 9:18 AM IST

కబళించిన బ్లాక్‌ ఫంగస్‌.. కుటుంబం చిన్నాభిన్నం

కన్నబిడ్డను కాలుకింద పెట్టకుండా చూసుకునే ఆ కన్నతండ్రి.. ప్రేమకు ప్రతిరూపంగా ఇన్నాళ్లూ నిలిచారు. కానీ.. అతను ఇప్పుడు ఓ జ్ఞాపకంగా.. మిగిలిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈలోకాన్ని వదిలి వెళ్లిపోయారు. కరోనాను జయించిన ఆంజనేయ వరప్రసాద్‌.. బ్లాక్‌ఫంగస్‌కు బలయ్యారు. కడప మరాఠావీధికి చెందిన వరప్రసాద్.. డ్రైవర్‌గా పనిచేస్తూ బతుకుబండిని లాగేవారు. ఆయనకు గతంలో కరోనా సోకింది. ఆసుపత్రిలో.. చికిత్స పొంది కోలుకున్నారు. విజయుడై ఇంటికి వెళ్లారు.

గండం గడిచిందనుకున్న సమయంలో.. అతనికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. ఈ నెల 9న కడపలోని హోలిస్టిక్ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. కన్ను, మెదడుకు బ్లాక్ ఫంగస్ సోకిందని పిడిగులాంటి వార్త చెప్పారు వైద్యులు. శస్త్ర చికిత్స సైతం చేశారు. చికిత్స కొనసాగుతుండగానే ఈనెల 17న మృతి చెందారు. వరప్రసాద్‌కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్య వరలక్ష్మి ప్రస్తుతం గర్భవతి. ఇప్పుడు కుటుంబానికి ఆధారమేలేదనికన్నీరుమున్నీరవుతోంది వరప్రసాద్‌ కుటుంబం.

ABOUT THE AUTHOR

...view details