కడప నగరంలోని మద్యం దుకాణాల వద్ద కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఆదివారం కావడం వల్ల ఎక్కువ మంది షాపుల వద్ద నిల్చున్నారు. వీరిలో అత్యధికంగా కూలీలు, మధ్యతరగతి, పేద కుటుంబాల వారే అధికంగా కనిపించారు. మాస్కులు విషయంలో జాగ్రత్త వహించినా... భౌతిక దూరాన్ని మాత్రం మరిచారు. దుకాణం నిర్వాహకులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా.. మందుబాబులు మద్యం కోసం ప్రభుత్వ నిబంధనలు పక్కకు పెట్టినట్లు కనిపిస్తోంది.
మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం మరిచారు... - కడప నగరం తాజా మద్యం వార్తలు
కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ నగరంలోని మద్యం దుకాణాల వద్ద మందు భౌతిక దూరం మరచి కిలోమీటరు మేర క్యూ కట్టారు. ప్రభుత్వ నిబంధనలు సైతం విస్మరించారు.
మద్యం దుకాణాల వద్ద జనం బారులు