ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వేరుశనగ రైతులు

By

Published : Oct 23, 2020, 7:29 PM IST

ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షార్పణం అయ్యింది. ఏటా వర్షాభావం రైతులను కుంగదీస్తుండగా ఈసారి అతివృష్టి అన్నదాతల పాలిట శాపంగా మారింది. వాణిజ్య పంటలు చేతికొచ్చే దశలో వర్షాలు అధికంగా పడడం వల్ల పంట భూమిలోనే కుళ్లిపోయి కడప జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు.

peanut crop lost in kadapa district due to heavy rains
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వేరుశనగ రైతులు

కడప జిల్లాలో ఏటా సాగుచేస్తున్న వేరుశనగ పంట రైతులకు ప్రధాన వాణిజ్య పంటగా ఉంటుంది. జూన్, జూలై మాసాల్లో ప్రభుత్వం రాయితీపై వేరుశనగ విత్తనాలు అందజేస్తుంది. వీటితోపాటు రైతులు బయట కొంటుంటారు. ఈసారి అలానే అధిక ధరలు పెట్టి కొని పంట వేశారు.

జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, చిన్నమండెం, సంబేపల్లి, చక్రాయపేట, పులివెందుల, కమలాపురం ప్రాంతాల్లో రైతులు సుమారు 20 వేల హెక్టార్లలో వేరుశనగ సాగుచేశారు. పంట సాగు, ఎరువులు, సేద్యపు ఖర్చులు, కలుపు, తెగుళ్ళ నివారణకు ఎకరాకు రూ, 20 వేల వరకు ఖర్చుచేశారు. ముందు అవసరమైన మేరకు వర్షాలు పడటంతో ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది. అయితే ప్రస్తుతం దిగుబడిని తీసుకునే సమయంలో వాయుగుండం, అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు పడి వేరుశనగ భూమిలోనే కుళ్లిపోయింది. రోజుల తరబడి జల్లులు పడటంతో వేరుశెనగ పంట బూజు పట్టి పనికిరాకుండా పోయింది. చేతిదాకా వచ్చిన పంట నోటికి అందక రైతులు కుంగిపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని వేడుకుంటున్నారు.

అయితే పంట నష్ట పరిహారం ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని.. తామేమీ చేయలేమంటూ అధికారులు అంటున్నారని రైతులు వాపోతున్నారు.

ఇవీ చదవండి..

అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ అమ్మవారికి పూజలు

ABOUT THE AUTHOR

...view details