సీఎం జగన్ తనకు తోచిన విధంగా పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్ ధ్వజమెత్తారు. జగన్ నియంత పాలన చేస్తున్నారని కడపలో మీడియా సమావేశంలో అన్నారు. తితిదే పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు. వైకాపా ప్రభుత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అడ్వకేట్ జనరల్ ఎన్నడూ లేని విధంగా మీడియా ముందుకు రావడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు అన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసినవేనని పేర్కొన్నారు. ఆయన ఖర్చు పెడుతున్న డబ్బులన్నీ ప్రజలవే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. జగన్కు ఏడాదిలో ఎక్కడో కాదు కడప జిల్లాలో ఒక్క కార్యక్రమం పూర్తిచేశామని చెప్పుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కడప కలెక్టరేట్ ను ఇక్కడినుంచి మార్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల వేలం వేస్తున్నారని ఆరోపించారు.
సీఎం జగన్ నియంతలా పాలిస్తున్నారు: పీసీసీ చీఫ్ శైలజానాథ్ - Congress party state president sailajnath comments on cm jagan
ఏడాది పాలనలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలం చెందారని పీసీసీ చీఫ్ శైలజానాథ్ విమర్శించారు.
పీసీసీ చీఫ్ శైలజానాథ్
TAGGED:
పీసీసీ చీఫ్ శైలజానాథ్