ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BC COMMISSION: సుబ్బయ్య హత్యకేసులో జిల్లా ఎస్పీకి బీసీ కమిషన్ లేఖ

కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన తెదేపా నేత నందం సుబ్బయ్య కేసులో దిల్లీకి రావాలని ఎస్పీ అన్బురాజన్​కు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి లేఖ రాశారు. గత నెలలో సుబ్బయ్య భార్య అపరాజిత ఇచ్చిన వినతిపత్రంపై కమిషన్ స్పందించింది.

BC COMMISSION
BC COMMISSION

By

Published : Sep 3, 2021, 8:55 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన తెదేపా నాయకుడు నందం సుబ్బయ్య హత్యకేసులో పూర్వపరాలు తెలుసుకునేందుకు ఈనెల 6న దిల్లీలో కమిషన్ ముందు హాజరు కావాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి లేఖ రాశారు. గత ఏడాది డిసెంబరు 29న ప్రొద్దుటూరులో పట్టపగలు నందం సుబ్బయ్య దారుణహత్యకు గురయ్యారు. దీనిపై అప్పట్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, బంగారు మునిరెడ్డి, కమిషనర్ రాధ పేర్లు కేసులో చేర్చాలని సుబ్బయ్య భార్య అపరాజిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్పందించని పోలీసులు..

కానీ పోలీసులు దానిపై స్పందించలేదు. దీంతో గతనెల 7న ప్రొద్దుటూరుకు వచ్చిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజుకు నందం సుబ్బయ్య భార్య వినతిపత్రం ఇచ్చారు. తన భర్త హత్యకేసులో ముగ్గురు పేర్లను పోలీసులు కేసులో చేర్చడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు స్పందిస్తూ.. కడప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఈనెల 6న కేసుపై చర్చించేందుకు విచారణ నివేదిక తీసుకుని దిల్లీకి రావాలని లేఖలో తెలిపారు. ఇదే విషయంపై ఎస్పీని వివరణ కోరణగా.. కేసు దర్యాప్తు చేస్తున్న ప్రొద్దుటూరు డీఎస్పీ కమిషన్ ఎదుట హాజరవుతారని తెలిపారు.

ఇదీ చూడండి:హత్యకు గురైన నందం సుబ్బయ్య చివరిగా ఏం మాట్లాడారంటే..!

గతంలో హామీ ఇచ్చిన డీఎస్పీ..

సుబ్బయ్య కేసులో.. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, బంగారు రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లను ఎఫ్​ఐఆర్​లో చేర్చాలని లోకేశ్​తో సహా తెదేపా నేతలు రోడ్డుపై బైఠాయించి డిమాండ్​ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు పేర్లు చేరుస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. సుబ్బయ్య భార్య అపరాజిత నుంచి సెక్షన్ 161 ప్రకారం వాంగ్మూలం నమోదు చేశారు.

ఇదీ చదవండి:

HEAVY RAINS: కడప జిల్లాలో భారీ వర్షాలు.. నిండిన ప్రాజెక్టులు

ABOUT THE AUTHOR

...view details