Murder in Kadapa: కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖలీల్ నగర్లో మధ్యాహ్నం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హత్య చేసిందెవరు.. ఎందుకు చేశారనే విధంగా ఆరా తీశారు. డబ్బుల కోసమే గొడవ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
స్నేహితుడే.. కానీ చంపేశారు... ఏమైందంటే..! - కడపలో నేరాలు
Murder in Kadapa: వారు ముగ్గురూ స్నేహితులు. ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. గొడవలు, కొట్లాటలు వాళ్లకు సహజం. కానీ ఈసారి జరిగిన గొడవ మాత్రం ఓ స్నేహితుడి ప్రాణాలు బలిగొంది. ఎందుకో తెలుసా...
పోలీసుల ప్రకారం...:కడప ఖలీల్ నగర్‌కు చెందిన ఇమ్రాన్ భాషా, అదే ప్రాంతానికి చెందిన షేక్ హర్షిత్, షేక్ మాలిక్ ముగ్గురు స్నేహితులు. తరుచూ కలుసుకుని మాట్లాడుకోవడం..సరాదాగా కొట్లాడుకోవటం వారికి పరిపాటే. అయితే వీరిలో ఇమ్రాన్ భాషా తన స్నేహితులు ఇద్దరిని తరుచూ డబ్బులు అడిగేవాడు. ఒకవేళ తన స్నేహితులు అడిగినప్పుడు డబ్బు ఇవ్వకపోతే వారిద్దరిని కొట్టేవాడు. ఇవాళ కూడా మృతుడు ఇమ్రాన్ భాషా స్నేహితులను డబ్బులు అడిగాడు. వారు ఇవ్వలేదు... దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తులైన షేక్ హర్షిత్, షేక్ మాలిక్ ఇద్దరు తమ వద్ద ఉన్న కత్తులు తీసుకుని ఇమ్రాన్ భాషాను విచక్షణారహితంగా పొడిచారు. దీంతో ఇమ్రాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడి శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ముద్దాయిల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకట శివ రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి :